Mon Dec 23 2024 09:32:58 GMT+0000 (Coordinated Universal Time)
పొట్టా ? బ్లేడ్ ల కొట్టా ? ఏకంగా 56 బ్లేడు ముక్కలు మింగేశాడు
గంట సేపటికి యశ్పాల్కు రక్తపు వాంతులు అయ్యాయి. దాంతో భయపడిపోయి మిత్రులకు ఫోన్ చేయగా వాళ్లొచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లారు.
రక్తపు వాంతులు కావడంతో.. ఆస్పత్రిలో చేరిన ఓ యువకుడికి వైద్యులు స్కాన్ చేశారు. అతని కడుపులో కనిపించిన దృశ్యం చూసి వైద్యులు షాకయ్యారు. ఈ ఘటన రాజస్థాన్ లోని జాలోర్ జిల్లా సంచోర్ ప్రాంతంలో వెలుగుచూసిందీ ఘటన. యశ్పాల్ సింగ్(26) అనే యువకుడు ఓ ప్రైవేటు సంస్థలో డెవలపర్ గా పనిచేస్తున్నాడు. మరో నలుగురు స్నేహితులతో కలిసి బాలాజీ నగర్లో ఉంటున్నాడు. ఆదివారం (మార్చి 12) ఉదయం స్నేహితులంతా విధులకు వెళ్లిపోవడంతో యశ్పాల్ ఒక్కడే గదిలో ఉన్నారు.
గంట సేపటికి యశ్పాల్కు రక్తపు వాంతులు అయ్యాయి. దాంతో భయపడిపోయి మిత్రులకు ఫోన్ చేయగా వాళ్లొచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతనికి పరీక్షలు చేసి స్కానింగ్ చేసిన వైద్యులు పొట్టలో కనిపించిన దృశ్యం చూసి నిర్ఘాంత పోయారు. అతడి కడుపులో ఏకంగా 56 బ్లేడు ముక్కలు గుర్తించారు. వెంటనే శస్త్ర చికిత్స చేసి వాటిని తొలగించారు. బ్లేడుపై ఉన్న కవర్తోనే బాధితుడు బ్లేడ్లను మింగేయడంతో అతనికి నొప్పి కలగలేదని వైద్యులు పేర్కొన్నారు. అవి పొట్టలోకి చేరాక పేపర్ జీర్ణం కావడంతో ఆ తర్వాత బ్లేడ్లు ప్రతాపం చూపించడం మొదలుపెట్టాయన్నారు. వాటి ఫలితంగానే రక్తపు వాంతులు అయ్యాయని పేర్కొన్నారు. అయితే యశ్ పాల్ బ్లేడ్లను ఎందుకు మింగాడన్నదీ తెలియలేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
Next Story