Mon Dec 23 2024 14:23:40 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ద్రౌపది ముర్ము నామినేషన్
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నేడు నామినేషన్ దాఖలు చేస్తున్నారు.
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నేడు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. నామినేషన్ పత్రాాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించనున్నారు. ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపికయిన ద్రౌపది ముర్ముకు ఇప్పటికే పలుపార్టీలు మద్దతు ప్రకటించాయి. ఒడిశాలోని బిజూ జనతాదళ్, ఏపీలోని వైసీపీ తన మద్దతును తెలిపాయి. ద్రౌపది ముర్ము నామినేషన్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరు కానున్నారు. అలాగే కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతారు.
రాష్ట్రాల పర్యటన...
ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న ద్రౌపది ముర్ము ఒడిశా భవన్ లో బస చేశారు. ద్రౌపది ముర్ము ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. ద్రౌపది ముర్ము రాష్ట్రాల పర్యటనను పర్యవేక్షించే బాధ్యతను కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్ షెకావత్ లు పర్యవేక్షించనున్నారు. ఒక్క రోజులో రెండు రాష్ట్రాలను పర్యటించేలా ఏర్పాటు చేస్తున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలను ఒకచోటకు చేర్చి ద్రౌపది ముర్ము ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
Next Story