Mon Dec 23 2024 09:55:04 GMT+0000 (Coordinated Universal Time)
ముర్ము ఇంటి వద్ద కోలాహలం
రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. ఢిల్లీలో ఆమె నివాసానికి నాయకులు వచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్నారు
రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. ఢిల్లీలో ఆమె నివాసానికి నాయకులు వచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిన్న రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు ఆమె నివాసానికి వచ్చి అభినందనలు తెలిపారు. ద్రౌపది ముర్ముతో కాసేపు ముచ్చటించారు. ద్రౌపది ముర్ము ఈ నెల 25వ తేదీన రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలను చేపట్టబోతున్నారు. నిన్న ఫలితాలు వెలువడటంతో ఆమె నివాసానికి కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు వచ్చి అభినందనలు తెలుపుతున్నారు.
వెంకయ్య నాయుడు....
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్రౌపది ముర్ము నివాసానికి కుటుంబ సమేతంగా వచ్చి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. కిషన్ రెడ్డి ద్రౌపది ముర్ము ప్రచార కార్యక్రమంలో సమన్వయకర్తగా వ్యవహరించారు. భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముర్ము నివాసానికి వచ్చి అభినందనలు తెలిపారు. తిరుమల నుంచి వచ్చిన అర్చకులు ఆమె కు తీర్థ ప్రసాదాలను అందచేసి ఆశీర్వచనాలను అందచేశారు. ద్రౌపది ముర్ము ఇంటి వద్ద కోలాహలం కొనసాగుతుంది.
Next Story