Mon Dec 23 2024 05:20:50 GMT+0000 (Coordinated Universal Time)
ఊహించని విధంగా వ్యాపిస్తున్న మంకీపాక్స్
మంకీపాక్స్ మశూచి వలె వైరస్ల కుటుంబానికి చెందినది కానీ సాధారణంగా తేలికపాటి ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది. ఇది చర్మ గాయాలు..
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజా సమాచారం ప్రకారం, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC)లో 2022 సంవత్సరం.. మొదటి మూడు నెలల్లో 1,088 మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. 2021 సంవత్సరంలో ఇదే కాలంలో నమోదైన కేసుల సంఖ్య 1,126 గా ఉంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు మంకీపాక్స్ కారణంగా 52 మరణాలు సంభవించాయి.
మంకీపాక్స్ మశూచి వలె వైరస్ల కుటుంబానికి చెందినది కానీ సాధారణంగా తేలికపాటి ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది. ఇది చర్మ గాయాలు.. శరీర ద్రవాలు, దుస్తులు.. ఇలాంటి కొన్ని వస్తువులు కలుషితమైన పదార్థాలతో ప్రత్యక్ష సంబంధం ద్వారా వ్యక్తుల మధ్య వ్యాప్తి చెందుతుంది. ఇది సాధారణంగా కొన్ని అడుగుల కంటే ఎక్కువ ప్రయాణించలేదు. పెద్ద శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాపిస్తుంది. రోగితో ఎక్కువసేపు మాట్లాడినా, అతడి ముందే ఉన్నా కూడా మంకీపాక్స్ వ్యాపిస్తుంది.
ఈ అనారోగ్యం సాధారణంగా ఫ్లూ-వంటి లక్షణాలు, శోషరస కణుపుల( lymph nodes) వాపుతో ప్రారంభమవుతుంది. ముఖం, శరీరంపై ఎక్కువ దద్దుర్లకు కారణమవుతుంది. చాలా ఇన్ఫెక్షన్లు 2-4 వారాలు ఉంటాయి. 21 రోజుల పాటు మంకీపాక్స్ లక్షణాలతో ఉంటారు. మనుషుల్లో మంకీపాక్స్ అంటువ్యాధులు ప్రధానంగా మధ్య మరియు పశ్చిమ ఆఫ్రికా దేశాలలో చోటు చేసుకుంటూ ఉంటాయి.
Next Story