Mon Dec 23 2024 12:01:15 GMT+0000 (Coordinated Universal Time)
బస్సులో ప్రయాణికురాలిపై యువకుడి మూత్రవిసర్జన
బస్సులోని 28వ నంబరు సీటులో కూర్చున్న మెకానికల్ ఇంజినీరింగ్ చదువుకున్న రామప్ప అనే 25 ఏళ్ల యువకుడు బస్సు..
ఇటీవల ఎయిరిండియా విమానంలో 70 ఏళ్ల వృద్ధురాలిపై శంకర్ మిశ్రా అనే వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర సంచలనమైంది. తాజాగా అలాంటి ఘటనే కర్ణాటకలో వెలుగుచూసింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తోన్న మహిళపై ఓ యువకుడు మూత్ర విసర్జన చేశాడు. మంగళవారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విజయపుర నుంచి మంగళూరుకు వెళ్తున్న బస్సు హుబ్బళ్లి సమీపంలోని కిరేసూరులోని ఓ దాబా వద్ద ఆగింది. ప్రయాణికులంతా టీ తాగేందుకు బస్సు దిగారు.
బస్సులోని 28వ నంబరు సీటులో కూర్చున్న మెకానికల్ ఇంజినీరింగ్ చదువుకున్న రామప్ప అనే 25 ఏళ్ల యువకుడు బస్సు ముందువరుసలో కూర్చున్న మహిళ వద్దకు వెళ్లి ఆమెపై మూత్ర విసర్జన చేశాడు. నిద్రలో ఉన్న ఆమె.. ఈ పరిణామంతో ఒక్కసారిగా లేచి కేకలు పెట్టారు. దీంతో బస్సులోని మిగతా ప్రయాణికులు, బస్సు దిగి టీ తాగుతున్న వారు పరుగున ఆమె వద్దకు వచ్చారు. నిందితుడిని పట్టుకు చితక్కొట్టి బయటకు తోసేశారు. అతని లగేజీని విసిరేశారు. నిందితుడైన యువకుడు మద్యంమత్తులో ఈ పనిచేసినట్లు తెలుస్తోంది. బాధిత మహిళ దాబాలోని స్నానాల గదిలోకి వెళ్లి స్నానం చేసి దుస్తులు మార్చుకుని వచ్చే వరకు బస్సును ఆపారు. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మహిళ నిరాకరించిందని కండక్టర్ తెలిపారు.
Next Story