Fri Dec 27 2024 02:14:04 GMT+0000 (Coordinated Universal Time)
నేడు పాఠశాలలకు సెలవు
భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా తమిళనాడు ప్రభుత్వం నేడు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది
భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా తమిళనాడు ప్రభుత్వం నేడు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. తమిళనాడు రాష్ట్రంలో గత రెండు రోజుల నుంచి కుండపోత వర్షం కురుస్తుంది. జనజీవనం స్థంభించిపోతుంది. రహదారులన్నీ వాన నీటితో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ప్రభుత్వ కార్యాలయాలూ...
ప్రధానంగా దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొత్తం నాలుగు జిల్లాల పరిధితో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి పాఠశాలలకు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు బ్యాంకులు, ప్రయివేటు సంస్థలు కూడా సెలవులను ప్రకటించాయి. స్టాలిన్ ప్రభుత్వం అప్రమత్తమయింది.
Next Story