Mon Dec 23 2024 13:07:19 GMT+0000 (Coordinated Universal Time)
వీడి తెలివి తెల్లారి పోనూ.. లవ్ బ్రేకప్ అయ్యాక.. జీఎస్టీతో సహా ఖర్చుల జాబితా పంపి మరీ
ప్రేమించిన కాలం ఏడు నెలలు. అయిన ఖర్చు మాత్రం 1,02,000 రూపాయలు
నేటి యువతరం ప్రేమించుకోవడం ఎంత వేగమో.. అంతే వేగంగా బ్రేకప్ అవుతుంటుంది. ప్రేమించడానికి కనపడని కారణాలు.. బ్రేకప్ కావడానికి కూడా కన్పించవు. నేటి రోజుల ప్రేమాయణాలు ఇలా సాగి ఛస్తున్నాయి. అందుకే ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువ కాలం నిలబడవంటారు. పెద్దలు సూచించిన పెళ్లిళ్లే పది కాలాల పాటు మనగలుతాయన్న ధోరణికి వస్తున్నారు. ఇద్దరు కలసి ఒకరినొకరు అర్థం చేసుకోవడం మాట అటుంచితే ఒకరి నుంచి మరొకరు ఆర్థికంగా లాభపడటమే నేటి యువతలో ఎక్కువగా కనిపిస్తుంది.
ఏడు నెలల ప్రేమ...
ప్రేమించిన కాలం ఏడు నెలలు. అయిన ఖర్చు మాత్రం 1,02,000 రూపాయలు. అందుకు జీఎస్టీ కూడా వేసి మరీ పంపాడు మనోడు.అయితే ఇందులో కొంత న్యాయం పాటించాడు. తాను కూడా అందులో భాగస్వామి కాబట్టి సగం అంటే 60,635 రూపాయలు చెల్లించాలని పంపాడు. సరిగ్గా అలాంటి ఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక ప్రియుడు తన ప్రియురాలి కోసం పెట్టిన ఖర్చుతో ఒక లిస్ట్ తయారు చేశాడు. దానికి జీఎస్టీని కూడా కలిపాడు. బ్రేకప్ అయిన తర్వాత తాను ఖర్చు చేేసిన మొత్తాన్ని చెల్లించాలని ప్రియురాలిని ప్రియుడు డిమాండ్ చేయడం ఇప్పుడు నయా ట్రెండ్ కు దారితీసిందనే చెప్పాలి.
ఎక్సెల్ షీట్ లో...
సీఏ చదివిన కుర్రాడొకరు తన మాజీ ప్రియురాలికి తమ ప్రేమ బ్రేకప్ అయిన తర్వాత పంపిన ఖర్చుల జాబితా ను చూసి నెట్టింట్ నవ్వులు పూయిస్తుంది. క్యాబ్ నుంచి కాఫీ ఖర్చుల వరకూ ఏవీ వదలకుండా మనోడు జాబితాలో చేర్చి మరీ ఆమెకు పంపి మరీ వసూలుకు సిద్ధమయ్యాడు. ఇది నిజమో .. అబద్ధమో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ఎక్సెల్ షీట్ వైరల్ గా మారింది.
Next Story