Mon Dec 23 2024 07:05:38 GMT+0000 (Coordinated Universal Time)
Breaking: ఇండోనేషియోలో భారీ భూకంపం : 20 మంది మృతి
ఇండోనేషియోలో భారీ భూకంపం సంభవించింది. భూకంపానికి 20 మంది మరణించినట్లు ప్రాధమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది
ఇండోనేషియోలో భారీ భూకంపం సంభవించింది. భూకంపానికి 20 మంది మరణించినట్లు ప్రాధమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.6 గా నమోదయింది. మూడు వందల మంది పైగా గాయాలపాలయినట్లు తెలుస్తోంది. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోంది.
300 మందికి గాయాలు...
ఇండోనేషియోలో సంభవించిన భూకంపం కారణంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థిితి విషమంగా ఉందని చెబుతున్నారు. శిధిలాల కింద మరికొందరు ఉంటారని భావిస్తున్నారు. భూకంపం జరిగిన సమయంలో ప్రజలు భయపడి రోడ్డు మీదకు పరుగులు తీశారు.
Next Story