Sat Dec 21 2024 02:19:10 GMT+0000 (Coordinated Universal Time)
బిహార్లో భూకంపం
బీహార్ లో భూప్రకంపనలు భయాందోళనలకు గురిచేశాయి. రిక్టర్ స్కేల్ పై 4.3తీవ్రతగా నమోదయింది.
బీహార్ లో భూప్రకంపనలు భయాందోళనలకు గురిచేశాయి. రిక్టర్ స్కేల్ పై 4.3తీవ్రతగా నమోదయింది. బీహార్ లోని అరారియాలో ఈ భూ కంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అధికారులు వెల్లడించారు. తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించినట్లు చెబుతున్నారు.
రిక్టర్ స్కేల్ పై....
భూకంప తీవ్రతకు ప్రజలు ఇళ్లలో నుంచి భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అర్థం కాక ఆందోళన చెందారు. అయితే ఈ సందర్భంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అధికారులు వెల్లడించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
- Tags
- earthquake
- bihar
Next Story