Sun Dec 22 2024 23:01:54 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : జమ్ముకశ్మీర్ లో భూకంపం
మధ్యాహ్నం 1.33 గంటల సమయంలో భూ ప్రకంపనలు సంభవించినట్లు తెలిపింది. 6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని
జమ్ముకశ్మీర్ లో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. మధ్యాహ్నం 1.33 గంటల సమయంలో భూ ప్రకంపనలు సంభవించినట్లు తెలిపింది. 6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దోడాలోని గందో భలేసా గ్రామానికి 18 కిలోమీటర్ల దూరంలో 6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
జమ్ముకశ్మీర్ తో పాటు దేశరాజధాని ఢిల్లీలో, చంఢీగఢ్, పంజాబ్ లతో పాటు ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు కనిపించాయి. భూమి ఒక్కసారిగా ఊగుతున్నట్టు అనిపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. భారత్ తో పాటు పాకిస్థాన్ లోనూ 5.6 తీవ్రతతో పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు పాకిస్థాన్ వాతావరణ శాఖ వెల్లడించింది. అక్కడ మధ్యాహ్నం 1.04 గంటలకు భూప్రకంపనలు రాగా.. తూర్పు కశ్మీర్ లో 10 కిలోమీటర్ల లోతులో భూకంపకేంద్రం ఉన్నట్లు గుర్తించారు. లాహోర్, ఇస్లామాబాద్, పెషావర్ లలో ప్రకంపనలు కనిపించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
Next Story