Sun Apr 06 2025 13:12:30 GMT+0000 (Coordinated Universal Time)
Earth Quake : ఢిల్లీలో భూకంపం
ఢిల్లీలో ఈరోజు తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 4 గా నమోదయింది

ఢిల్లీలో ఈరోజు తెల్లవారుజామున భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ఈ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. నిద్రమతత్తులో ఉన్న ప్రజలు ఒక్కసారి ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. నోయిడా, గురుగ్రామ్ ప్రాంతాల్లో కొన్ని సెకన్లు పాటు భూమి కంపించింది.
భూకంప తీవ్రత...
రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత నాలుగు గా నమోదయింది. ఢౌలా కాన్ లోని దుర్గాబాయ్ దేశ్ ముఖ్ కాలేజీ సమీపంలో ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరోసారి భూప్రకంపనలు వచ్చే అవకాశముందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు నిచ్చారు.
Next Story