Sun Dec 14 2025 23:22:11 GMT+0000 (Coordinated Universal Time)
Earth Quake : అస్పాంలో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై తీవ్రత?
అస్సాంలో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.0గా నమోదైంది

అస్సాంలో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.0గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెెలిపింది. మోరిగావ్ ప్రాంతంలో గురువారం ఉదయం 2.25 గంటలకు భూమి కంపించిందని వెల్లడించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు.
ఇతర ప్రాంతాల్లోనూ...
అస్సాం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ స్వల్ప భూ ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. పదహారు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. అదే సమయంలో భూటాన్, చైనా, బంగ్లాదేశ్ లో సహా మరికొన్ని దేశాల్లోనూ భూ ప్రకంపనలు సంభవించాయని అధికారులు తెలిపారు. అయితే సాధారణమేనని, ఎవరూ భయాందోళనలు చెందాల్సిన పనిలేదని తెలిపారు.
Next Story

