Sat Mar 15 2025 12:32:38 GMT+0000 (Coordinated Universal Time)
Earthquake : ఢిల్లీలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు
దేశ రాజధాని ఢిల్లీ భూప్రకంపనలు ప్రజలను అర్ధరాత్రి భయకంపితులను చేశాయి.

దేశ రాజధాని ఢిల్లీ భూప్రకంపనలు ప్రజలను అర్ధరాత్రి భయకంపితులను చేశాయి. చైనా లో కూడా భూకంపం భారీగా సంభవించింది. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ లోనిఅనేక ప్రాంతాల్లో నిన్న రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.2 తీవ్రతగా నమోదయిందని నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ అధికారులు తెలిపారు. భూకంప కేంద్రం చైనాలోని దక్షిన జిన్ జియాంగ్ లో ఉందని తెలిపారు.
రిక్టర్ స్కేల్ పై...
రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు సంభవించయి. భూకం కేంద్రం భూమికి 80 కిలోమీటర్ల లోతులో ఉందని అధికారులు తెలిపారు. ఢిల్లీలో వరసగా భూకంపాలు సంభవిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ భూకంప తీవ్రతకు ఎంత మేర నష్టం జరిగిందని ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story