Mon Dec 23 2024 16:34:23 GMT+0000 (Coordinated Universal Time)
రాహుల్ గాంధీ రిక్వెస్ట్ పై స్పందించిన ఈడీ
శుక్రవారం విచారణకు హాజరుకాలేనంటూ ఓ లేఖ రాశారు రాహుల్ గాంధీ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విచారణకు రాలేనంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పారు. శుక్రవారం విచారణకు హాజరుకాలేనంటూ ఓ లేఖ రాశారు రాహుల్ గాంధీ. తన తల్లి బాగోగులు చూసుకునేందుకు అనుమతించాలని, విచారణను పొడిగించాలని లేఖలో ఈడీని కోరారు రాహుల్ గాంధీ. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ మూడు రోజులు పాటు ప్రశ్నల వర్షం కురిపించింది. మరోవైపు ఈడీ విచారణకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శన చేపట్టింది. తన తల్లి కరోనాతో చికిత్స పొందుతోందని విచారణకు హాజరుకాలేనని, తన తల్లి బాగోగులు చూసుకోవడానికి కొన్ని రోజులు విచారణను పొడిగించాలని లేఖలో కోరారు రాహుల్.
తన విచారణను జూన్ 20, సోమవారానికి వాయిదా వేయాలన్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అభ్యర్థనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆమోదించింది. దీంతో సోమవారం విచారణకు రావాల్సిందిగా సంస్థ తాజాగా సమన్లు జారీ చేసింది. తన తల్లి సోనియా గాంధీని చూసుకునేందుకు గంగారామ్ ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చిందని రాహుల్ గాంధీ ఈడీ అధికారులకు చెప్పారు. సోనియా గాంధీకి కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. రాహుల్ తన తల్లిని చూసుకోవడానికి గంగారామ్ ఆసుపత్రిలో రోజంతా గడపాలని భావిస్తున్నారు.
News Summary - Rahul Gandhi’s request ed postpones questioning to June 20
Next Story