Mon Dec 23 2024 03:47:03 GMT+0000 (Coordinated Universal Time)
పోలీస్ ఆఫీసర్ ను పెళ్లాడిన మంత్రి
ఐపీఎస్ అధికారిణి జ్యోతి యాదవ్ తో హర్జోత్ సింగ్ బైన్స్ వివాహం శనివారం ఓ గురుద్వారాలో ఘనంగా జరిగింది. జ్యోతి యాదవ్ ఇటీవలే
లేడీ పోలీస్ ఆఫీసర్ ను పెళ్లాడి.. ఓ మంత్రి వార్తల్లోకెక్కారు. పంజాబ్ ఆప్ మంత్రి వర్గంలో అత్యంత పిన్న వయస్కుడైన హర్జోత్ సింగ్ బైన్స్ ఓ ఇంటివాడయ్యారు. ఆయన వయసు 32 సంవత్సరాలు. ఆయన ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ ను పెళ్లాడటం విశేషం. ఐపీఎస్ అధికారిణి జ్యోతి యాదవ్ తో హర్జోత్ సింగ్ బైన్స్ వివాహం శనివారం ఓ గురుద్వారాలో ఘనంగా జరిగింది. జ్యోతి యాదవ్ ఇటీవలే మాన్సా జిల్లాకు ఎస్పీగా నియమితులయ్యారు. హర్జోత్ సింగ్ వృత్తిరీత్యా న్యాయవాది. ఆయన ఆప్ పార్టీ తరపున రూప్ నగర్ జిల్లాలోని ఆనందపూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
హర్జోత్ సింగ్ పెళ్లాడిన ఎస్పీ జ్యోతి యాదవ్ స్వస్థలం హర్యానాలోని గురుగ్రామ్. గతేడాది ఆప్ ఎమ్మెల్యే రాజిందర్ పాల్ కౌర్ తో పబ్లిక్ లో జరిగిన గొడవ కారణంగా.. వార్తల్లో నిలిచింది. మంత్రి హర్జోత్, ఎస్పీ జ్యోతి యాదవ్ లకు ఇటీవలే నిశ్చితార్థం జరగుగా.. నిన్న వివాహం జరిగింది. నిన్న జరిగిన వీరి పెళ్లికి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రముఖులు హాజరై ఆశీస్సులు అందించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా వివాహానికి హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు.
Next Story