Fri Nov 22 2024 14:54:46 GMT+0000 (Coordinated Universal Time)
పతనం అంచున ఠాక్రే సర్కార్
మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తుంది. ఠాక్రే ప్రభుత్వానికి ముప్పు పొంచి ఉంది.
మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తుంది. ఠాక్రే ప్రభుత్వానికి ముప్పు పొంచి ఉంది. మంత్రి ఏక్ నాధ్ షిండే నేతృత్వంలో 35 ఎమ్మెల్యేలు క్యాంపులో ఉన్నారని తెలిసింది. అదే జరిగితే ఉద్థవ్ థాక్రే ప్రభుత్వానికి ముప్పు ఏర్పడినట్లే. శివసేన రెబల్ ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుండటంతో కొంత ఉత్కంఠ పెరుగుతుంది. ఇప్పటికే దీనిపై చర్చించేందుకు మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, పాటిల్ లు ఢిల్లీ చేరుకున్నారు. బీజేపీ పెద్దలతో మహారాష్ట్ర రాజకీయాలపై చర్చించనున్నారు.
పెరుగుతున్న అసంతృప్త ఎమ్మెల్యేలు...
అధికారంలోకి రావాలంటే 145 మంది శాసనసభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుతం బీజేపీకి 113 మంది శాసనసభ్యుల మద్దతు ఉంది. 35 మంది శివసేన ఎమ్మెల్యేలు బీజేపీ పక్షాన నిలిస్తే అధికారంలోకి వచ్చినట్లే. ఆ దిశగా బీజేపీ ప్రయత్నాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే, ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ వైఖరిపైనే ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. వారిని బుజ్జగించేందుకు శివసేన నేతలు ప్రయత్నిస్తున్నారు.
Next Story