Mon Dec 23 2024 10:24:47 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యేలకు క్లాస్ పీకిన షిండే
ముఖ్యమంత్రిగా షిండే ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో గోవా హోటల్ లో డ్యాన్స్ లు వేసిన వారిపై అసంతృప్తి వ్యక్తం చేశారు
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో గోవా హోటల్ లో డ్యాన్స్ లు వేసిన వారిపై షిండే అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత షిండే గోవాకు వెళ్లి తన వర్గం ఎమ్మెల్యేలతో మాట్లాడారు. వారు షిండే ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో టేబుళ్ల పైకి ఎక్కి డ్యాన్సులు వేశారు. ఆనందంతో మునిగిపోయారు. కానీ షిండే మాత్రం అలాంటివి వద్దని, ఎమ్మెల్యేలు సంయమనంతో వ్యవహరించాలని షిండే క్లాస్ పీకినట్లు చెబుతున్నారు.
మంత్రి వర్గ విస్తరణపై...
వీరు డ్యాన్స్ లు చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అనేక మంది ఎమ్మెల్యేల తీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పాటు రేపు, ఎల్లుండి మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. స్పీకర్ ఎన్నిక కూడా ఉంది. అనంతరం మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. దీనిపై కూడా తన వర్గం ఎమ్మ్మెల్యేలతో షిండే ప్రత్యేకంగా చర్చించినట్లు తెలిసింది. తన గ్రూపులోని పది మందికి మాత్రమే మంత్రి వర్గంలో చోటు దక్కనుంది. మిగిలిన వారికి ప్రత్యేక హామీ ఇచ్చేందుకే ఆయన గోవా వెళ్లి వారితో సమావేశమై చర్చించినట్లు సమాచారం.
Next Story