Thu Dec 19 2024 17:07:04 GMT+0000 (Coordinated Universal Time)
నేటితో ముగియనున్న ప్రచారం
కర్ణాటకలో నేటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈరోజు సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది
కర్ణాటకలో నేటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈరోజు సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అగ్రనేతలందరూ కన్నడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్నారు.
సోనియాతో పాటు...
కాంగ్రెస్ నుంచి కూడా సోనియా గాంధీ, రాహల్, ప్రియాంక గాంధీలతో పాటు జాతీయ స్థాయి నేతలు కూడా పాల్గొన్నారు. ఈ నెల 10వ తేదీన పోలింగ్ జరగనుంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 13వ తేదీన ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ముందస్తు సర్వేలు మాత్రం కాంగ్రెస్కు అనుకూలంగా నివేదికలు ఇస్తున్నాయి.
Next Story