Tue Nov 05 2024 16:33:04 GMT+0000 (Coordinated Universal Time)
నేడు మిజోరం ఎన్నికల కౌంటింగ్ ఎందుకు జరగలేదంటే?
ఐదు రాష్టాల్లో ఎన్నికలు జరిగిన మిజోరంలో నేడు ఓట్ల లెక్కింపు జరగడం లేదు
ఐదు రాష్టాల్లో ఎన్నికలు జరిగిన మిజోరంలో నేడు ఓట్ల లెక్కింపు జరగడం లేదు. సోమవారం నాడు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆ రాష్ట్రంలో కొన్ని వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఈసీ వాయిదా వేసింది. ఐదు రాష్ట్రాల్లోనూ ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలతో మిజోరంలో కౌంటింగ్ ప్రక్రియను డిసెంబర్ 4 కు వాయిదా వేసింది ఎన్నికల సంఘం. మిగిలిన 4 రాష్ట్రాల్లో మాత్రం కౌంటింగ్ యథాతథంగా సాగుతోంది.
మిజోరంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించే తేదీని మార్చాల్సిందిగా వివిధ వర్గాలు, పలువురు ప్రజా ప్రతినిధులు కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ తన నోటిఫికేషన్లో పేర్కొంది. డిసెంబర్ 3వ తేదీ ఆదివారం కావడంతో మిజోరం ప్రజలకు ప్రత్యేక ప్రాధాన్యత వుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ అంశాలను పరిగణనలోనికి తీసుకుని మిజోరంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 4కు మార్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓట్ల లెక్కింపు రోజును మార్చాలని రాష్ట్రంలోని వివిధ వర్గాల నుండి ప్రతిపాదనలు రావడంతో కౌటింగ్ తేదీని సవరించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 40 మంది సభ్యులున్న మిజోరం అసెంబ్లీకి నవంబర్ 7న జరిగిన ఎన్నికలలో మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ (ZPM), కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. రాష్ట్రంలో 80.66 శాతం ఓటింగ్ నమోదైంది. కౌంటింగ్లో 4,000 మందికి పైగా సిబ్బంది పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా 13 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపునకు 399 ఈవీఎం టేబుళ్లు, 56 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేశారు.
Next Story