Sun Dec 22 2024 19:25:51 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్నికల సంఘం వెబ్సైట్ క్రాష్
నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో
నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫలితాల కోసం పెద్ద సంఖ్యలో ఎన్నికల సంఘం (EC) వెబ్సైట్ను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఈసీ వెబ్సైట్ క్రాష్ అయినట్లు తెలుస్తోంది. దానిపై నెటిజన్లు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేస్తున్నారు. తమకు వెబ్సైట్ ఓపెన్ కావడం లేదని పోస్టులు పెడుతున్నారు. ఈ సమస్యను ఈసీ పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
మధ్యప్రదేశ్ లో అధికార బీజేపీ హవా కొనసాగుతోంది. రాష్ట్రంలోని 138 నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థులే లీడ్ లో ఉన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థులు 89 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. 230 అసెంబ్లీ స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 116 సీట్లను గెలుచుకోవాలి. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ బీజేపీ అభ్యర్థులు దూసుకెళుతున్నారు. తొలి రౌండ్ లో బీజేపీ అభ్యర్థులు 107 స్థానాల్లో లీడ్ లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 80 చోట్ల ముందంజలో ఉన్నారు. మరో 13 చోట్ల ఇతరులు లీడ్ లో ఉన్నారు.
Next Story