Thu Dec 26 2024 14:25:42 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఉప రాష్ట్రపతి ఎన్నిక
భారత ఉప రాష్ట్రపతి ఎన్నిక నేడు జరగనుంది. ఉదయం పది గంట లనుంచి సాయంత్రం 5 గంటల వరకూ పార్లమెంటు హాలులో ఈ పోలింగ్ జరగనుంది
భారత ఉప రాష్ట్రపతి ఎన్నిక నేడు జరగనుంది. ఉదయం పది గంట లనుంచి సాయంత్రం 5 గంటల వరకూ పార్లమెంటు హాలులో ఈ పోలింగ్ జరగనుంది. ఉప రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీఏ అభ్యర్థిగా పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్ఖడ్ , విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వా పోటీ చేయనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఈ ఎన్నికల్లో కేవలం పార్లమెంటు సభ్యులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుంటారు.
ఆయన వైపే....
లోక్ సభకు చెందిన 545 మంది, రాజ్యసభ సభ్యులు 245 మంది ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్ఖడ్ విజయం దాదాపు ఖాయమయినట్లే. ఎందుకంటే మెజారిటీ ఓటర్లు ఎన్డీఏ వైపు ఉండటంతో ఆయన ఎన్నిక దాదాపు ఖాయమైంది. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ మాత్రం పాల్గొనడం లేదు. ఎన్నికలకు దూరంగా ఉంటామని మమత బెనర్జీ ప్రకటించింది. ఈరోజు రాత్రికి ఫలితం ప్రకటించనున్నారు.
Next Story