Mon Dec 23 2024 14:00:17 GMT+0000 (Coordinated Universal Time)
ప్రయాణికుల్లో 11 రకాల కరోనా వేరియంట్లు.. ఎయిర్ పోర్టుల్లో అలర్ట్
ముఖ్యంగా బీఎఫ్ 7 వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో.. పాజిటివ్ వచ్చిన వారి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కు..
కరోనా మరోసారి పడగ విప్పింది. చైనాలో మరణ మృదంగం మోగిస్తోన్న కరోనా.. ప్రపంచ దేశాలకూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. భారత్ కు వచ్చే ప్రయాణికుల్లోనూ కరోనా కొత్తవేరియంట్లు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా బీఎఫ్ 7 వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో.. పాజిటివ్ వచ్చిన వారి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపుతున్నారు. ఎయిర్ పోర్టుల్లో అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో 2022 డిసెంబర్ 24 నుండి 2023 జనవరి 3వ తేదీ వరకూ విదేశాల నుండి 9.05 లక్షల మంది భారత్ కు చేరుకోగా.. 19,227 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
వారిలో 124 మంది కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. 40 మంది నుండి సేకరించిన శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపగా.. ఏకంగా 11 కొత్త వేరియంట్లు బయటపడ్డాయి. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB శ్రేణిలో వరుసగా.. XBB1, XBB2, XBB3,XBB4, XBB5 లతో పాటు BQ1.1.5:9 వేరియంట్లను గుర్తించారు. ఇప్పటి వరకూ BF7 వేరియంట్ కేసులు నాలుగింటిని గుర్తించారు.
Next Story