Mon Dec 23 2024 02:30:44 GMT+0000 (Coordinated Universal Time)
జమ్మూ కశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం !
పుల్వామా జిల్లాలోని చాంద్ గామ్ లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. చంద్ గామ్ లో
జమ్మూ కశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసులు.. భద్రతా దళాలు తెలిపిన వివరాల మేరకు.. పుల్వామా జిల్లాలోని చాంద్ గామ్ లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. చంద్ గామ్ లో ఉగ్రవాదులున్నారని సమాచారం అందగా.. స్థానిక పోలీసులు, భద్రతా దళాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు నిర్వహించాయి.
పోలీసులు, భద్రతా దళాల రాకను గమనించిన ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. వెంటనే భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరపగా.. ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. వీరంతా జైషే మహమ్మద్ గ్రూప్ కు చెందిన ఉగ్రవాదులుగా గుర్తించారు. ఘటనా ప్రాంతంలో ఆయుధాలు, 1ఎం -4 కార్బైన్లు, ఏకే రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు.
Next Story