Tue Mar 18 2025 00:32:03 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఛత్తీస్గడ్ లో మరో భారీ ఎన్ కౌంటర్ .. ఏడుగురు మావోల మృతి
ఛత్తీస్గడ్ లో ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మరణించారు

ఛత్తీస్గడ్ లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మరణించారు. ఛత్తీస్గడ్ లోని నారాయణ్పూర్ లో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే మరణించిన మావోయిస్టులు ఎవరన్నది ఇంకా అధికారికంగా పోలీసులు ప్రకటించలేదు.
వరస ఎన్కౌంటర్లతో...
ఇటీవల ఛత్తీస్గడ్ అడవులను భద్రతాదళాలు జల్లెడ పడుతున్నాయి. వరస ఎన్కౌంటర్లలో అనేక మంది మావోయిస్టులు మరణించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మావోయిస్టులు ఇటీవల కాలంలో జరిగిన ఎన్కౌంటర్లలో మరణించారు. తాజాగా జరుగుతున్న ఎన్కౌంటర్ లో ఏడుగురు చనిపోయారని, వారివద్ద నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story