Mon Dec 23 2024 07:35:42 GMT+0000 (Coordinated Universal Time)
ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. వీరు లష్కరే తోయిబా ఉగ్రవాదులుగా గుర్తించారు. భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని పోలీసులు తెలిపారు. ఉగ్రవాదుల నుంచి ఏకే 47 రైఫిల్, పిస్టల్, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. జమ్మూకశ్మీర్లో గడిచిన 24 గంటల్లో ఇది రెండో ఎన్కౌంటర్.
జమ్మూకాశ్మీర్లో...
హతమైన ఉగ్రవాదుల మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరు షోపియాన్ జిల్లాకు చెందిన షకీర్ మజీద్ నజర్, హనన్ అహ్మద్ షేగా గుర్తించారు. వీరిద్దరూ లష్కరే తోయిబాకు చెందిన స్థానిక ఉగ్రవాదులని పోలీసులు తెలిపారు. వారు ఈ ఏడాది మార్చిలోనే లష్కరే తోయిబాలో చేరినట్టు పేర్కొన్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్టు చెప్పారు. భద్రతాదళాలు సమర్థవంతంగా ఉగ్రవాదుల దాడులను తిప్పికొట్టాయని అధికారులు పేర్కొన్నారు.
Next Story