Fri Dec 20 2024 08:18:11 GMT+0000 (Coordinated Universal Time)
రేపు ఈడీ ముందుకు సీఎం
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 3న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అక్రమ మైనింగ్ కు సంబంధించి మనీ లాండరింగ్ కు పాల్పడ్డారన్న అభియోగాలతో ఈడీ ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.
అక్రమ మైనింగ్ కేసులో....
రేపు రాంచీలోని ఈడీ రీజనల్ కార్యాలయంలో హేమంత్ సోరెన్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇదే కేసులో గతంలో ఈడీ ఆయన సన్నిహితుడు పంకజ్ మిశ్రాతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. వెయ్యి కోట్లకు పైగా అక్రమ మైనింగ్ జరిపినట్లు గుర్తించింది. మరి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రేపు ఈడీ ఎదుటకు హాజరవుతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story