Sat Nov 23 2024 05:20:31 GMT+0000 (Coordinated Universal Time)
సోనియా, రాహుల్ కు సమన్లు
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది.
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఈ సమన్లు జారీ చేసింది. దీనిని కక్ష సాధింపు చర్యగా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజా వ్యతిరేక స్వరాన్ని అణిచి వేసేందుకు ప్రభుత్వం ఈడీని ఉపయోగించుకుంటుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యరదర్శి రణదీప్ సూర్పెవాలా ఆరోపించారు. మోదీ పెంపుడు సంస్థగా ఈడీ పనిచేస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆస్తులు స్వాధీనం ....
నేషనల్ హెరాల్డ్ ఆస్తులను సోనియా, రాహుల్ లు తమ స్వాధీనం చేసుకున్నారని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి గతంలో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ కు నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న 90.25 కోట్లను వసూలు చేసుకునేందుకు యంగ్ ఇండియన్ ప్రయివేట్ లిమిటెడ్ ద్వారా కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. దీనిపై గతంలో విచారణ జరిగింది. తాజగా ఈడీ సోనియా, రాహుల్ కు నోటీసులు జారీ చేసింది.
Next Story