Mon Dec 15 2025 04:04:23 GMT+0000 (Coordinated Universal Time)
Aravind Kejrival : కేజ్రీవాల్ కు మరోసారి నోటీసులు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటి వరకూ అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తొమ్మిదిసార్లు నోటీసులు జారీ చేశారు. అయినా ఆయన ఏవో కారణాలు చెప్పి హాజరు కాలేదు.
ఈసారైనా హాజరవుతారా?
నిన్న రౌస్ అవెన్యూ కోర్టు సమన్లతో అక్కడకు హాజరైన కేజ్రీవాల్ కు బెయిల్ లభించింది. అయితే ఈరోజు మరోసారి నోటీసులు జారీ చేసింది. 21న కేజ్రీవాల్కు విచారణ హాజరవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడంతో కేజ్రీవాల్ విషయంలో ఎలాంటి ినిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story

