Sun Dec 22 2024 21:14:19 GMT+0000 (Coordinated Universal Time)
సోనియాకు మరోసారి ఈడీ సమన్లు
సోనియా గాంధీకి మరోసారి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు
సోనియా గాంధీకి మరోసారి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 25వ తేదీన ఈడీ ఎదుటకు హాజరు కావాలని కోరారు. ఈరోజు సోనియా గాంధీని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. మధ్యాహ్నం రెండు గంటల వరకూ విచారణ జరిపిన అనంతరం ఆమెను వెళ్లిపొమ్మన్నారు. ఈ విచారణలో నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి మొత్తం 25 ప్రశ్నలు వేసినట్లు సమాచారం. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికి సోనియా గాంధీ సమాధానం చెప్పారు. కొన్నింటికి మాత్రం తనకు తెలియదని చెప్పారని అంటున్నారు.
ఈ నెల 25న....
మరోసారి ఈ నెల 25వ తేదీన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుటకు విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. ఆరోగ్య కారణాల రీత్యా తొలిరోజు విచారణను త్వరగానే అధికారులు ముగించారు. ఈ విచారణలో ఐదుగురు అధికారులు పాల్గొన్నారు. విచారణలో సోనియాక సహాయకారిగా ప్రియాంక గాంధీ ఉన్నారు. సోనియా ను విచారిస్తున్న గదిలో కాకుండా పక్క గదిలో ప్రియాంక ఉన్నారు. తొలిరోజు మూడు గంటలు మాత్రమే సోనియాను ఈడీ అధికారులు విచారించారు.
Next Story