Mon Dec 23 2024 08:22:36 GMT+0000 (Coordinated Universal Time)
సంజయ్ రౌత్ ఇంట్లో ఈడీ సోదాలు
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ సోదాలు నిర్వహిస్తుంది.
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ సోదాలు నిర్వహిస్తుంది. ఇప్పటికే సంజయ్ రౌత్ కు రెండుసార్లు నోటీసులు జారీ చేసింది. తమ ఎదుట హాజరు కావాలని కోరింది. అయితే ఈరోజు అకస్మాత్తుగా ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. ఒక భూ కుంభకోణం కేసులో సంజయ్ రౌత్ ను విచారించాలని ఈడీ భావించింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్ల కోసం ఈడీ సోదాలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
భూ కుంభకోణం కేసులో....
శివసేనలో సంజయ్ రౌత్ కీలకంగా ఉన్నారు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం మొన్న మొదలయినప్పుడే ఈడీ నోటీసులు జారీ చేసింది. శివసేన పై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు కేంద్ర ప్రభుత్వం దిగుతుందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే సంజయ్ రౌత్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. భూ కుంభకోణంలో ఆరోపణలు వచ్చినందునే ఈడీ సోదాలు నిర్వహిస్తుందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.
Next Story