Mon Jan 13 2025 23:56:33 GMT+0000 (Coordinated Universal Time)
తమిళనాడులో ఈడీ సోదాలు
తమిళనాడులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పలు కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు
తమిళనాడులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పలు కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈడీ అధికారులు బృందాలుగా విడిపోయి ఈ దాడులు నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అందిన సమాచారం మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
రియల్ ఎస్టేట్ కంపెనీల్లో...
తమిళనాడులోని రియల్ ఎస్టేట్ కంపెనీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అనేక కంపెనీలు పెద్దమొత్తంలో పన్ను చెల్లింపు ఎగవేతతో పాటు బినామీ కంపెనీల ద్వారా నగదు లావాదేవీలు జరిగాయని గుర్తించిన అధికారులు ఆ దిశగా సోదాలను నిర్వహిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. రియల్ ఎస్టేట్ కంపెనీలు పెద్ద మొత్తంలో పన్ను ఎగవేసినట్లు కూడా ఆరోపణలున్నాయి.
Next Story