Mon Dec 23 2024 05:19:33 GMT+0000 (Coordinated Universal Time)
రెండో రోజూ ఈడీ తనిఖీలు
నేషనల్ హెరాల్డ్ కేసులో రెండో రోజూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు
నేషనల్ హెరాల్డ్ కేసులో రెండో రోజూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 8గంటల నుంచి సోదాలు ప్రారంభమయ్యాయి. నిన్న ప్రధాన కార్యాలయంతో పాటు పది చోట్ల సోదాలు నిర్వహించారు. ఈరోజు ఢిల్లీతో పాటు లక్నో, కోల్కత్తా నగరాల్లోని పన్నెండు చోట్ల ఈడీ సోదాలను నిర్వహిస్తుంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం సోదాలను నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.
ఆధారాలున్నాయని....
మనీలాండరింగ్ కు పాల్పడినట్లు అనుమానాలున్నాయని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ప్రశ్నించిన ఈడీ అధికారులు ఈడీ కార్యాలయాల్లో సోదాలను నిర్వహిస్తున్నారు. వారి నుంచి సేకరించిన సమాచారానికి అదనపు సమాచారాన్ని సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. కొన్ని ఆధారాలు లభించాయని ఈడీ అధికారులు చెబుతుండటం విశేషం. మరో వైపు కాంగ్రెస్ మాత్రం రాజకీయ కక్షలో భాగంగా ఈడీ అధికారులు వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
Next Story