Mon Dec 23 2024 00:10:55 GMT+0000 (Coordinated Universal Time)
మరోసారి ఈడీ నోటీసులు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈ నోటీసులు జారీ చేసింది. డిసెంబరు 21వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలని కోరింది. గత నవంబరు 2న నోటీసులు జారీ చేసినా అప్పట్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉండటంతో తాను హాజరు కాలేనని ఈడీ అధికారులకు వివరణ ఇచ్చారు.
21న హాజరు కావాలంటూ....
అయితే ఈసారి మరోసారి నోటీసులను జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ లను అరెస్ట్ చేశాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన కేజ్రీవాల్ ఈడీ ఎదుట విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. ఈసారి కేజ్రీవాల్ హాజరు కాకుంటే ఈడీ ఏం చేయనున్నదన్న దానిపై కూడా సర్వత్రాచర్చ జరుగుతుంది.
Next Story