Mon Dec 23 2024 09:38:50 GMT+0000 (Coordinated Universal Time)
Aravind Kejrival : రాజీనామా చేస్తారా? సీఎంగా కొనసాగుతారా?
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్నుఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను రాత్రి అరెస్ట్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిన్న రాత్రి ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు జరిపిన అనంతరం ఆయనను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన ఈడీ కార్యాలయానికి తరలించారు. ముఖ్యమంత్రిగా ఉన్న ఒక వ్యక్తిని ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి. ఆయన తన పదవికి రాజీనామా చేస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకూ ఆయన తన పదవికి రాజీనామా చేయలేదు.
నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్న...
ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం ఢిల్లీ లిక్కర్ స్కామ్, మనీలాండరింగ్ కేసులో ఆయనను విచారించేందుకు తమకు అప్పగించాలని ఈడీ కోరే అవకాశముంది. ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఆందోళనకు దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను పోలీసులు అక్కడి నుంచి పంపించి వేశారు. నిన్న హైకోర్టు అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వలేమని చెప్పిన రాత్రికి ఈడీ అధికారులు వచ్చి అరెస్ట్ చేయడం విశేషం. ఈడీ అరవింద్ కేజ్రీవాల్ కు తొమ్మిది సార్లు నోటీసులు ఇచ్చినా ఏదో కారణాలు చెప్పి విచారణకు హాజరు కాలేదు. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ కొనసాగుతారని పార్టీ నేతలు చెబుతుండగా, ఆయన రాజీనామా చేయాల్సి వస్తుందని మరికొందరు అంటున్నారు.
Next Story