Wed Feb 19 2025 23:12:20 GMT+0000 (Coordinated Universal Time)
Train Journey : రైలులో లోయర్ బెర్త్ దొరకకపోవడానికి అసలు కారణం మీకు తెలుసా?
రైలు ప్రయాణమంటే అందరికీ ఇష్టం. అదొక అనుభూతి.
![train, reservation,lower bearth, indian railways train, reservation,lower bearth, indian railways](https://www.telugupost.com/h-upload/2025/01/30/1685747-train.webp)
రైలు ప్రయాణమంటే అందరికీ ఇష్టం. అదొక అనుభూతి. రైల్వే స్టేషన్ ను చూసినా.. రైలులో ప్రయాణిస్తున్నా ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. అందుకే దేశంలో అనేక మంది రైళ్లనే ఆశ్రయిస్తారు. రైలు ప్రయాణాలకే ముందు ప్రాధాన్యత ఇస్తారు. సుఖంగా ప్రయాణం చేయడానికి రైలు అంత సౌకర్యం మరొకటి ఉండదు. వృద్ధుల నుంచి చిన్న పిల్లల వరకూ రైలు ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తారంటే అదీ భారతీయ రైళ్లకు ఉండే ప్రత్యేకత అయితే ముందుగా టిక్కెట్లు రిజర్వు చేసుకున్నా అనుకున్న చోట, కావాల్సిన బెర్త్ లు తమకు లభించవన్న అసంతృప్తి మాత్రం అందరిలోనూ ఉంటుంది. ప్రతి ఒక్కరికీ లోయర్ బెర్త్ కావాలని భావిస్తారు. స్లీపర్ బోగీల నుంచి సెకండ్ క్లాస్, ట్రీ టైర్ ఏసీ బోగీల్లో ప్రయాణించే వారు కూడా ఇదే రకమైన ఫీలింగ్స్ కలిగి ఉంటారు.
అందరికీ లోయర్ బెర్త్ కావాలంటే?
కానీ రైల్వే శాఖ అందరికీ లోయర్ బెర్త్ కేటాయించే అవకాశం లేదు. అందుకు కారణాలు కూడా అనేకం ఉన్నాయి. పట్టాల మీద పరుగులు పెట్టే రైలుకు ఒక క్రమపద్ధతిలో ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి ప్రాధాన్యత ఇస్తూ వెళ్లడం ఆనవాయితీ. అదే మంచిదని కూడా నిపుణులు చెబుతున్నారు. కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో గంటకు పరుగులు తీసే రైలులో ఎలా పడితే అలా రిజర్వేషన్ టిక్కెట్లను కేటాయించే అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రయాణం ప్రమాదాలకు లోను కాకుండా సురక్షితంగా జరగాలంటే కొన్ని చర్యలు తీసుకోక తప్పదు. రైలులో ప్రయాణమయ్యే బరువు అంతటా సమానంగా ఉండే విధంగా భారతీయ రైల్వే టికెట్ బుకింగ్ విధానపు సాఫ్ట్ వేర్ ను రూపొందించారు.
ప్రాధాన్యత క్రమంలో...
మామూలుగా చూసుకుంటే ఒక రైల్లో S1 నుండి S10 వరకు స్లీపర్ క్లాసు బోగీలు ఉన్నాయనుకుంటే.. అందులో ఒకొక్క బోగీలో 72 సీట్లు ఉంటాయి. అందువల్ల, మొట్టమొదట టికెట్ బుక్ చేసుకునేవారికి నడుమనున్న బోగీలో (S5 లేదా S6లో) టికెట్ కేటాయిస్తారట. పైగా అందులో కూడా, 30 – 40 నంబరు సీటు కేటాయిస్తారు. అందులోనూ ఫస్ట్ బుక్ చేసుకున్న వారికి లోయర్ బెర్త్ కేటాయిస్తారు. రైలులో గ్రావిటీ సెంటర్లుసాధ్యమైనంత తక్కువగా ఉండేందుకు గాను, అప్పర్ బెర్త్ ల కంటే ముందుగా లోయర్ బెర్త్ లను కేటాయిస్తారు. ఇలా మొదట మధ్యలో ఉండే బోగీలలో మధ్య సీట్లు, అలాగే క్రమంగా చివరి సీట్లు, (మొదట లోయర్ బెర్త్, ఆ తరువాతనే అప్పర్ బెర్త్, మిడిల్ బెర్త్) కేటాయిస్తారు. ఆ తరువాత మధ్య బోగీలకు పక్కన ఉండే బోగీలలో (S4, S7) మరలా అదే విధంగా సీట్ల కేటాయింపు జరుగుతూ వెళుతుంది.
బరువు సమానంగా...
బరువు అన్ని రైలు బోగీలలోనూ సమానంగా ఉండే విధంగా టికెట్ల కేటాయింపు చేస్తారు. చివరి నిమిషాలలో టికెట్ కోసం ప్రయత్నించినపుడు మనకు అప్పర్ బెర్త్ లు, 1-6 లేదా 66-72 నంబరు సీట్లు, కేటాయింపబడటానికి కారణం ఇదేనంటున్నారు. మనం వెయిటింగ్ లిస్టులో ఉన్నపుడు ఎప్పుడైనా ఎవరైనా తమ సీటు క్యాన్సిల్ చేసుకుంటే మనకు మధ్యలో కూడా సీటు దొరకే అవకాశముంటుంది. ఈ విధానంలో కాకుండా ఐఆర్టీసీ తనకు నచ్చిన బోగీలో నచ్చిన సీటును ఇష్టారాజ్యంగా కేటాయించుకుంటూ పోతే ప్రమాదాలు జరిగే అవకాశముందంటున్నారు. S1, S2, S3 బోగీలు ప్రయాణికులతో నిండుగా ఉండి S5 S6 బోగీలు ఖాళీగా ఉండి, మిగిలిన బోగీలలో ప్రయాణికులు అక్కడక్కడ ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వేగంలో రైలు మలుపు తిరగవలసి వచ్చినా బరువు సమానంగా లేకపోతే అవి తిరగబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైలు పట్టాలు తప్పే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే మనం బుక్ చేసుకున్నప్పటికీ లోయర్ బెర్త్, మధ్యలో బోగీల్లో బెర్త్ లు కేటాయించకపోవడానికి అదే కారణమట.
Next Story