Mon Dec 23 2024 05:07:40 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు కు అంతా సిద్ధమయింది. మరికొద్దిసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు కు అంతా సిద్ధమయింది. మరికొద్దిసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కు అధికారులు అంతా సిద్ధం చేశారు. ఇందుకు కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఉత్తర్ ప్రదేశ్ ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది.
ఎగ్జిట్ పోల్స్ మాత్రం....
ఎగ్జిట్ పోల్స్ ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ విజయం ఖాయమని తేల్చి చెప్పాయి. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపించారు. ఇక పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టమైన మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. గోవాలో హంగ్ దిశగా ఫలితాలు వచ్చే అవకాశముందని చెప్పాయి. తొలుత పోస్టల్ బ్యాలెట్ లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలను ఏజెంట్ల సమక్షంలో తెరిచి కౌంటిగ్ ను స్టార్ట్ చేస్తారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
Next Story