Mon Dec 23 2024 02:46:43 GMT+0000 (Coordinated Universal Time)
వధువు మాజీ ప్రియుడి నిర్వాకం.. మండపంలో ఆగిన పెళ్లి
ఉత్తర్ ప్రదేశ్ లోని గాజిపుర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువతి, యువకుడు గతంలో..
ఇటీవల పీటల వరకూ వచ్చిన పెళ్లిళ్లు రకరకాల కారణాలతో ఆగిపోతున్నాయి. వరుడు మద్యం సేవించి ఉండటం, పెళ్లి ఇష్టం లేకపోవడం, వధువుకిి వరుడు నచ్చకపోవడం.. ఇలా రకరకాల కారణాలున్నాయి. కానీ ఇక్కడ పెళ్లి ఆగిపోవడానికి కారణం.. వధువు మాజీ ప్రియుడు. కొద్దిసేపటిలో వధువు మెడలో మూడుముళ్లు పడతాయనగా.. ఆమె మాజీ ప్రియుడు చేసిన పనికి వరుడు పెళ్లి రద్దు చేసుకుని వెళ్లిపోయాడు.
ఉత్తర్ ప్రదేశ్ లోని గాజిపుర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువతి, యువకుడు గతంలో ప్రేమించుకున్నారు. కొన్నాళ్ల తర్వాత విడిపోయారు. ఈ క్రమంలో యువతి కుటుంబీకులు ఆమెకు మరో వ్యక్తితో వివాహం నిశ్చయించారు. మే 17న పెళ్లి. పెళ్లి వేడుక జరుగుతుండగా.. ఆమె మాజీ ప్రియుడు వధూవరులున్న వేదికపైకి వచ్చి ఆమె నుదిటిన సింధూరం దిద్దాడు. ఈ చర్యతో అక్కడున్నవారంతా షాకయ్యారు.
ఇది చూసిన వరుడు తనకీ పెళ్లి వద్దంటే వద్దని కరాకండీగా చెప్పేసి, బంధువులతో కలిసి మండపం నుంచి వెళ్లిపోయాడు. వధువు నుదిటిన తిలకం దిద్దిన యువకుడు పారిపోతుండగా.. గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కాగా.. అతడు గతంలో కూడా యువతి వివాహాన్ని చెడగొట్టినట్లు సమాచారం.
Next Story