Tue Nov 05 2024 16:27:33 GMT+0000 (Coordinated Universal Time)
గవర్నర్ ను రీకాల్ చేయాల్సిందే
రాష్ట్ర గవర్నర్ మరాఠా ప్రజలను అవమానించారని మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు
రాష్ట్ర గవర్నర్ మరాఠా ప్రజలను అవమానించారని మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర నుంచి గుజరాతీలు, రాజస్థానీలు లేకపోతే ముంబయిలో డబ్బే ఉండదని గవర్నర్ భగత్‌సింగ్ కొశ్యారీ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పపట్టారు. హిందువులను విభజించేలా గవర్నర్ వ్యాఖ్యలు ఉన్నాయని ఉద్ధవ్ థాక్రే అన్నారు. ప్రభుత్వం ఆయనను రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే కొశ్యారీపై కేసు నమోదు చేసి జైలులో పెట్టాలని డిమాండ్ చేశారు.
ఇంకెంత కాలం?
గవర్నర్ పదవిని చూసి తాము ఇంతకాలం ఆయనను గౌరవిస్తున్నామన్నారు. ఇంకెంతకాలం మౌనంగా ఉండాలని ఉద్ధవ్ థాక్రే ప్రశ్నించారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలోనూ ఆలయాలను త్వరగా తెరవాలని తొందరపెట్టిన విషయాన్ని థాక్రే గుర్తు చేసుకున్నారు. గతంలో సావిత్రిబాయి పూలేను కూడా అవమానించారని కూడా ఆయన ఆరోపించారు. గుజరాత్, రాజస్థాన్ వారి వల్లే ముంబయికి పేరు వచ్చిందన్న గవర్నర్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. హిందువులను విడదీయవద్దని ఆయన కోరారు.
Next Story