Wed Jan 15 2025 08:31:19 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : కేజ్రీవాల్ కు మరోసారి షాక్
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ షాక్ ఇచ్చింది.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ షాక్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేజ్రీవాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించేందుకు హోం శాఖ అనుమతి మంజూరు చేసింది. ప్రస్తుతం ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ కేసులో బెయిల్ పై ఉన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాలతో...
సుప్రీంకోర్టు గతంలో ఈడీ ముందస్తు అనుమతులు తీసుకోవాలని తెలపడంతో హోంశాఖ వద్ద ఈ విజ్ఞప్తి పెండింగ్ లో ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే కొన్ని వారాల పాటు తీహార్ జైలుకు వెళ్లి వచ్చారు. అయితే ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు. కానీ ఇప్పుడు కేంద్ర హోం శాఖ అనుమతివ్వడంతో ఈడీ మరోసారి ఈ కేసులో కేజ్రీవాల్ ను విచారించే అవకాశముంది. ఢిల్లీ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ విచారణకు అనుమతివ్వడం కొంత ఆమ్ ఆద్మీపార్టీలో కలవరం రేపుతున్నాయి.
Next Story