Thu Dec 19 2024 12:53:51 GMT+0000 (Coordinated Universal Time)
కొనసాగుతున్న గాలింపు.. ఇప్పటి వరకూ 36 మంది మావోల మృతి
ఛత్తీస్గడ్ లో మావోయిస్టులు, భద్రతాదళాలకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి
ఛత్తీస్గడ్ లో మావోయిస్టులు, భద్రతాదళాలకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో మొత్తం 36 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. అయితే పోలీసు ఉన్నతాధికారులు మాత్రం మృతి చెందిన మావోయిస్టుల పేర్లను మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.
అగ్రనేతలు?
దీంతో ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఉన్నారని అనుమానాన్ని పౌరహక్కుల సంఘం నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి మృతదేహాలను భద్రతాదళాలు తరలిస్తున్నాయి. అయితే ఇంకా మావోయిస్టుల కోసం ఛత్తీస్గడ్ అడవుల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
Next Story