Mon Jan 06 2025 04:59:30 GMT+0000 (Coordinated Universal Time)
కమలానిదే హవా.. ఎగ్జిట్ పోల్స్
ఎగ్జిట్ పోల్స్ బయటకు వస్తున్నాయి. గుజరాత్ లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనాలు వేస్తూ ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి
గుజరాత్ లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ బయటకు వస్తున్నాయి. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనాలు వేస్తూ ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. గుజరాత్ లో 182 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బీజేపీకి వందకుపైగా స్థానాలు గెలుస్తాయని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. గుజరాత్ లో 130కి పైగా స్థానాలు వచ్చే అవకాశముందని కొన్ని సంస్థలు తేల్చాయి.
అత్యధిక స్థానాలు...
జన్ కీ బాత్ సర్వేలో బీజేపీ 117 నుంచి 140 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ కు 34 నుంచి 51 స్థానాలు వస్తాయని తేల్చింది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఆరు నుంచి పదమూడు స్థానాలు వస్తాయని చెప్పింది. పీపుల్స్ పల్స్ సర్వేలో బీజేపీకి 125 -143 స్థానాలు వస్తాయని తెలిపింది. కాంగ్రెస్ కు 30 నుంచి 48 స్థానాలు మాత్రమే దక్కుతాయని అంచనా వేేసింది. ఆమ్ ఆద్మీ పార్టీకి మూడు నుంచి ఏడు స్థానాలు వస్తాయని చెప్పింది.
Next Story