Thu Dec 19 2024 09:11:10 GMT+0000 (Coordinated Universal Time)
Exit Polls : మూడోసారి మళ్లీ మోదీయే
లోక్సభ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమికే అనుకూలంగా ఫలితాలు వస్తున్నాయి
లోక్సభ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమికే అనుకూలంగా ఫలితాలు వస్తున్నాయి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ఎక్కువ జాతీయ మీడియా సంస్థలు తేల్చాయి. మెజారిటీ సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ ను చూస్తే మూడోసారి అధికారం మోదీదేనని తేలింది. రిపబ్లిక్, ార్క్, ఇండియా న్యూస్ - డి డైనమిక్స్, రిపబ్లిక్ భారత్ - మ్యాట్రిజ్ సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం మూడు వందలకు పైగా స్థానాల్లో మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారని తేల్చింది.
ఏబీసీ సీ ఓటరు సంస్థ ఎన్డీఏకే
కొన్ని జాతీయ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేశాయి. ఎన్డీఏ కూటమి దేశంలో అధికారంలోకి వస్తుందని తేల్చాయి. రిపబ్లిక్ టీవీ ఎన్డీఏ 359 సీట్లు వస్తాయని తెలిపింది. 154 స్థానాలలో ఇండియా కూటమి పరిమితమవుతుందని తేల్చింది. సీఎన్ఎన్ న్యూస్ 18 ఎగ్జిల్ట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏ కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పాయి. ఏబీపీ సీ ఓటరు ఏపీలో వైసీపీ కి నాలుగు స్థానాలు, ఎన్టీఏకు 21 నుంచి 25 స్థానాలు వస్తాయని తేల్చింది.
Next Story