Mon Dec 23 2024 10:04:36 GMT+0000 (Coordinated Universal Time)
ఎగ్జిట్ పోల్స్ లో "ఆప్" ఆశలపై నీళ్లు
గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రం ఎగ్జిట్ పోల్స్ నిరాశను మిగిల్చాయి
గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రం ఎగ్జిట్ పోల్స్ నిరాశను మిగిల్చాయి. గుజరాత్ లో తమదే అధికారమని, కావాలంటే రాసిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆశలపై ఎగ్జిట్ పోల్స్ నీళ్లు చల్లాయి. గుజరాత్ లో ఎట్టిపరిస్థితుల్లో తమదే అధికారం అని కేజ్రీవాల్ చెప్పారు. అయితే ఆయన అంచనాలకు భిన్నంగా ఎగ్జిట్ పోల్స్ రావడం విశేషం.
అన్ని సర్వేలు...
పీపుల్స్ పల్స్ సర్వే గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి కేవలం మూడు నుంచి ఏడు స్థానాలే వస్తాయని చెప్పింది. ఔట్ ఆఫ్ ది బాక్స్ సంస్థ కూడా ఐదు నుంచి ఏడు స్థానాలు వస్తాయని తేల్చింది. న్యూస్ ఎక్స్ సర్వే కూడా ఆరు నుంచి పదమూడు స్థానాలకే ఆప్ పరిమితమవుతుందని తెలిపింది. టీవీ 9 గుజరాతీ మూడు నుంచి ఐదు స్థానాలు ఆప్ దక్కించుకుంటుందని చెప్పింది. అన్ని సర్వేలు ఆప్ కు వ్యతిరేకంగానే వచ్చాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ సర్వే నిజం అవుతాయని నమ్మడానికి వీలులేదు. అలాగని తోసిపుచ్చేందుకు కూడా వీలు కాదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.
Next Story