Sun Mar 30 2025 08:54:31 GMT+0000 (Coordinated Universal Time)
వరద బీభత్సం.. 52 మంది మృతి
అసోంలో వరద బీభత్సం కొనసాగుతూనే ఉంది. కొండచరియలు విరిగి పడిన ఘటనలో ఇప్పటి వరకూ 55 కి చేరిందని అధికారులు వెల్లడించారు

అసోంలో వరద బీభత్సం కొనసాగుతూనే ఉంది. కొండచరియలు విరిగి పడిన ఘటనలో ఇప్పటి వరకూ 55 కి చేరిందని అధికారులు వెల్లడించారు. వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేపట్టారు. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. హోజాయ్ జిల్లాలోని ఇస్లామాపూర్ లో వరద బాధితులను తరలిస్తున్న పడవ బోల్తా పడి ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యరు. 21 మందిని కాపాడగలిగారు.
మేఘాలయలోనూ....
అసోంలోని దాదాపు మూడు వేల గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. పంట నష్టం కూడా భారీగా సంభవించింది. కొండ చరియలు విరిగి పడటంతో రోడ్లన్నీ ధ్వంసమయి రాకపోకలకు అంతరాయం ఏరపడింది. మేఘాలయలోనూ వరదల తాకిడికి ప్రజలు విలవిలలాడుతున్నారు. మేఘాలయలో ఇప్పటి వరకూ వరదల కారణంగా 18 మంది మరణించారు. వరద సహాయక చర్యలు చేపట్టినా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.
Next Story