Mon Dec 23 2024 02:59:52 GMT+0000 (Coordinated Universal Time)
డౌట్ వచ్చి.. ఫ్యాక్టరీలోకి వెళ్లి వెతికారంతే!
భోపాల్ సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో జరిపిన సోదాల్లో
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి), యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఎటిఎస్) గుజరాత్ సంయుక్త ఆపరేషన్‌లో సుమారు రూ.1,800 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో జరిపిన సోదాల్లో డ్రగ్స్ బయటపడ్డాయి. ఫ్యాక్టరీలో తయారవుతున్న ఎండీ (మెఫెడ్రోన్) డ్రగ్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా డ్రగ్స్ ఉత్పత్తి చేస్తున్న ఇద్దరు నిందితులను అధికారులు అరెస్ట్ చేశారు.
డ్రగ్స్‌పై చేస్తున్న పోరాటంలో భారీ విజయాన్ని అందుకున్నారని గుజరాత్ మంత్రి హర్ష్ సంఘ్వీ అధికారులను ప్రశంసించారు. “మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగాన్ని ఎదుర్కోవడంలో కీలక విజయాన్ని సాధించాం. మన సమాజం ఆరోగ్యం, భద్రతను కాపాడటంలో వారి సహకార ప్రయత్నాలు చాలా కీలకమైనవి." అని ట్వీట్ చేశారు. ఢిల్లీ పోలీసులు ఇటీవల నగరంలో భారీ డ్రగ్స్ రాకెట్ ను పట్టుకోవడం సంచలనంగా మారింది. దక్షిణ ఢిల్లీలోని మహిపాల్‌పూర్‌లో దాదాపు రూ. 5,620 కోట్ల విలువైన 560 కిలోగ్రాముల కొకైన్, 40 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Next Story