Sun Dec 22 2024 11:49:34 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : అమెజాన్ కు కేంద్రం నోటీసులు
అమెజాన్ లో అయోధ్య లడ్డూలంటూ నకిలీవి విక్రయిస్తుండటంతో ఈ మేరకు ఆ కంపెనీకి నోటీసులు జారీ చేసింది.
అమెజాన్ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం నోటీసులు పంపింది. అమెజాన్ లో అయోధ్య లడ్డూలంటూ నకిలీవి విక్రయిస్తుండటంతో ఈ మేరకు ఆ కంపెనీకి నోటీసులు జారీ చేసింది. సెంట్రల్ కన్సూమర్ ప్రొడక్షన్ ఈ మేరకు అమెజాన్ కు నోటీసులు పంపింది. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
వారం రోజుల్లోగా...
అయోధ్యలో ఈ నెల 22వ తేదీన రాములు వారి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరుగుతుండటం, అయోధ్య రామాలయానికి సంబంధించి ప్రసాదాన్ని అమెజాన్ లో పంపిణీ జరుగుతుండటంతో ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. నకిలీ ప్రసాదాలను కొనుగోలు చేయవద్దని అయోధ్యలోని రామజన్మభూమి ట్రస్ట్ కోరుతుంది.
Next Story