Sat Nov 23 2024 09:18:22 GMT+0000 (Coordinated Universal Time)
మాయదారి కరోనా... ఇద్దరు దిగ్గజాలను మాయం చేసిందే?
ప్రముఖ గాయకుడు ఎస్సీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారినపడి మరణించారు. ఈరోజు ప్రముఖ గాయని లతా మంగేష్కర్ అదే కరోనాతో మృతి చెందారు
కరోనా ఎందుకు వచ్చిందో తెలియదు. దిగ్గజాలను మింగేసేందుకే వచ్చినట్లుంది. సంగీత ప్రపంచంలో కరోనా విషాదాన్ని మిగిల్చిందనేే చెప్పాలి. ప్రముఖ గాయకుడు ఎస్సీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారినపడి మరణించారు. ఈరోజు ప్రముఖ గాయని లతా మంగేష్కర్ అదే కరోనాతో మృతి చెందారు. కరోనా వచ్చి భారత సంగీత ప్రపంచంలో దిగ్గజాలను వెంట పెట్టుకుని వెళ్లిందని చెప్పక తప్పదు. ఈ ఇద్దరూ వేర్వేరు భాషల్లో పాడినా దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.
ఇద్దరికీ దేశ వ్యాప్తంగా....
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నలభై వేలకు పైగా పాటలు పాడారు. లతా మంగేష్కర్ ముప్ఫయి వేలకు పైగా పాటలు పాడారు. ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. నిత్యం వీరి పాటలు విన్పించని ఇల్లు దేశంలో ఉండదంటే అతిశయోక్తి కాదు. ఎస్సీ బాలసుబ్రహ్మణ్యం మృతిని జీర్ణించుకోలేక పోతున్న సంగీత ప్రియులకు లతామంగేష్కర్ మరణం విషాదాన్ని మిగిల్చింది.
Next Story