Sat Nov 16 2024 04:50:47 GMT+0000 (Coordinated Universal Time)
నాలుగో విడత చర్చలు కూడా సఫలం కాలేదే
ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన కొనసాగుతుంది. నాలుగో విడత చర్చలు జరిగాయి. అది కూడా సఫలం కాలేదు
ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన కొనసాగుతుంది. నాలుగో విడత చర్చలు జరిగాయి. అది కూడా సఫలం కాలేదు. ఇప్పటికే మూడు దఫాలు రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం తరుపున చర్చలు జరిపారు. అయితే అవి సఫలం కాలేదు. ఈరోజు ఛండీగడ్ లో రైతులతో కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పియూష్ గోయల్, నిత్యానందరాయ్ పాల్గొన్నారు.
ప్రధాన డిమాండ్ ను...
రైతులు అనేక డిమాండ్లు చేస్తున్నా అందులో ప్రధానమైనది కనీస మద్దతుధరపై చట్టబద్ధత కల్పించడం. దీనిపై ప్రతిపాదదను కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల ముందు పెట్టింది. దీనిపై నేడు చర్చించారు. చలో డిల్లీని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. అయితే రైతుల డిమాండ్లపై కొంత సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం కోరినా అందుకు రైతు సంఘాలు ఒప్పుకోలేదు. కేంద్రంపై వత్తిడి పెంచేందుకు భవిష్యత్ కార్యాచరణ ను ప్రకటించారు. అధికార పార్టీ నేతలు, మంత్రుల ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చాయి.
Next Story