Fri Nov 15 2024 16:20:49 GMT+0000 (Coordinated Universal Time)
Delhi : నేడు రైతు సంఘాలతో చర్చలు
ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. డిమాండ్లను పరిష్కరించాలంటూ మూడు రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు
ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ గత మూడు రోజుల నుంచి రైతులు ఆందోళనకు దిగారు. హర్యానా, పంజాబ్, ఉత్తర్ప్రదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో వస్తున్న రైతులను ఢిల్లీలోకి రాకుండా పోలీసులు అడ్డుకోగలిగారు. అయితే వారు మాత్రం రోడ్డుపైనే బైఠాయించి ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా...
అయితే నేడు కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో చర్చలు జరిపేందుకు సిద్ధమయింది. ముగ్గురు కేంద్ర మంత్రులు ఈ చర్చల్లో పాల్గొననున్నారు. ఆందోళనను విరమించాలని కోరనున్నారు. రైతులు కోరే కొన్ని డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గే అవకాశముంది. ట్రాఫిక్కు అంతరాయం కలిగించకుండా రైతులు ఆందోళన చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలను కోరింది.
Next Story