Tue Dec 17 2024 09:41:45 GMT+0000 (Coordinated Universal Time)
Farmers Protest : రైతులు మళ్లీ ఢిల్లీ వైపునకు.. నిలిపేసిన మొబైల్, ఇంటర్నెట్ సేవలు
డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రైతులు నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. 13న చలో ఢిల్లీకి పిలుపు నిచ్చారు
అన్నదాతలు మళ్లీ ఆందోళనకు పిలుపునిచ్చారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వారు పెద్దయెత్తున నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. రైతు సంఘాలన్నీ ఐక్యంగా ఉద్యమించేందుకు సిద్ధమయ్యాయి. దీంతో ఢిల్లీలోకి రైతులు ప్రవేశించకుండా పోలీసులు, భద్రతాదళాలు పెద్దయెత్తున మొహరించారు. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో బారికేడ్లను ఏర్పాటు చేసి ఆందోళనకారులు ఎవరినీ రానివ్వకుండా అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నెల 8వ తేదీన ఢిల్లీలోకి వచ్చే ప్రయత్నం చేసిన రైతులను నిలువరించాయి.
చలో ఢిల్లీ పిలుపుతో...
అయితే తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 13న చలో ఢిల్లీ కార్యక్రమానికి పంజాబ్, హర్యానా రైతులు పిలుపు నిచ్చాయి. దీంతో హర్యానాలోని ఏడు జిల్లాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఏడు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. బల్క్ ఎస్ఎంఎస్ సేవలను నిలిపివేశారు. ప్రధానంగా అంబాలా, కురుక్షేత్ర, ఫతేహాబాద్, సిిర్సా, కైథాల్, జింద్, హిసార్ జిల్లాల్లో ఈరోజు నుంచి 13వ తేదీ రాత్రి వరకూ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
డిమాండ్లు ఇవే....
రైతులు ఆందోళనలకు పిలుపునిచ్చిన సందర్భంగా ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులకు నష్టం కలిగే అవకాశముందన్న ఇంటలిజెన్స్ నివేదికల మేరకు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఎవరు గుంపుగా ఢిల్లీ సరిహద్దుల్లోకి వచ్చినా అరెస్ట్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియా వేదికగా ఎవరైనా వదంతులు వ్యాప్తి చెందిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. సంయుక్త కిసాన్ మోర్చా, కిసార్ మజ్దూర్ మోర్చా వంటి రైతు సంఘాలతో సహా రెండు వందల రైతు సంఘాలకు ఆందోళనకు ఫిలుపు నివ్వడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. 2020లో ఆందోళనలో పాల్గొన్న రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, పంట బీామ, రైతులకు పింఛను, కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలన్నది వారి ప్రధాన డిమాండ్.
Next Story